వచ్చేది మన ప్రభుత్వం.. ప్రజల ప్రభుత్వం

  • 2019లో నెల్లూరులో 10 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలు వైయస్‌ఆర్‌ సీపీవే
  • సింహపురి బిడ్డగా జన్మభూమిని మర్చిపోనుః ఎంపీ విజయసాయిరెడ్డి
నెల్లూరు: 2019 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంటుందని పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కోవూరు నియోజకవర్గ వైయస్‌ఆర్‌ సీపీ ప్లీనరీ సమావేశానికి ఎంపీలు విజయసాయిరెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, సంజీవయ్యలు హాజరయ్యారు. ముందుగా దివంగత నేత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. 

అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... అబద్ధపు హామీలతో 2014 ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. ప్రస్తుతం చంద్రబాబు మాటలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. ప్రజలంతా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వస్తుందన్నారు. సింహపురి బిడ్డగా నెల్లూరుకు సేవలందిస్తా, జన్మభూమిని మర్చిపోనని విజయసాయిరెడ్డి ఉద్ఘాటించారు. కార్యక్రమంలో పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మురళీధర్, సీజీసీ సభ్యులు నేదురుమల్లి పద్మనాభరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులకు శంకుస్థాపన
రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో ఎంపీ మేకపాటి, ఎమ్మెల్యేలు కాకాణి, అనిల్, శ్రీధర్‌రెడ్డి, సంజీవయ్య, ప్రతాప్‌కుమార్‌రెడ్డిలతో కలిసి అభివృద్ధి పనులకు శంకుస్థపన చేశారు. తన సొంత నిధులతో పోతిరెడ్డిపాలెం మల్లికార్జున వీధిలో రూ. 2.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. 


తాజా వీడియోలు

Back to Top