‘నవరత్నాల సభకు తరలి రండి’

తనకల్లు: కదిరి పట్టణంలోని దత్తా గార్డెన్స్‌లో గురువారం వైయస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ‘నవరత్నాల సభ’కు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆ పార్టీ నల్లచెరువు మండల కన్వీనర్‌ రమణారెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక ఎంపీటీసీ లలిత స్వగృహంలో బుధవారం ఆయన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దశరథనాయుడుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాల్లాంటి పథకాలపై అవగాహన కల్పించడంతోపాటు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సభలో చర్చ ఉంటుందన్నారు. సభకు పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, బూత్‌ లెవల్‌ కమిటీ సభ్యులు, కార్యకర్తలు విచ్చేయాలని కోరారు.

Back to Top