జై ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభకు తరలిరండి

విశాఖపట్నం(మునగపాక): రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి నేటి వరకు ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం.... తమ నాయకుడు వైయస్ జగన్‌ అలుపెరుగని పోరాటం చేస్తున్నారని ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త బొడ్డేడ ప్రసాద్‌ అన్నారు. ప్రత్యేక హోదా ద్వారా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. ప్రత్యేకహోదా సాధనకోసం  ఈనెల 6న విశాఖలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే సభకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. 


స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈసందర్బంగా ప్రసాద్‌ మాట్లాడుతూ... ఆంద్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ మొదటినుంచి పోరాటం చేస్తున్న పార్టీ వైయస్సార్‌సీపీయే అన్నారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందేనన్నారు. సమావేశంలో మునగపాక, అరబుపాలెం సర్పంచ్‌లు టెక్కలి రమణబాబు, లంబా అప్పారావు, పార్టీ నాయకులు కాండ్రేగుల నూకరాజు, బొడ్డేడ శ్రీనివాసరావు, ఇల్లా నాగేశ్వరరావు, జోగినాయుడు, పల్లె అప్పలనాయుడు , బీలా అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
Back to Top