అరకులోయను లూటీ చేసేందుకే బాబుతో కుమ్మక్కు

విశాఖపట్నం(అరకులోయ): వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ కిడారి సర్వేశ్వర్ రావుపై మండిపడ్డారు.  సర్వేశ్వరరావు రూ.10 నుంచి రూ.15 కోట్లకు అధికార పార్టీకి అమ్ముడుపోయారని ధ్వజమెత్తారు. అరకులోయలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలోఆయన విలేకరులతో మాట్లాడారు.

ఆంధ్రా ఊటీ అయిన అరకు లోయను లూటీ చేసేందుకే  కిడారి సర్వేశ్వరరావు  చంద్రబాబుతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. కిడారి తన పదవికి రాజీనామా చేయాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. చంద్రబాబుకు దమ్ముంటే  కిడారి చేత రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలన్నారు.   అరకులోయ ప్రజలు గత ఎన్నికల్లో కంటే రెట్టింపు మెజారిటీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని గెలిపిస్తారన్నారు. 

Back to Top