వైయస్ జగన్ అధ్యక్షతన కోఆర్డినేటర్ల సమావేశం

హైదరాబాద్ః వైయస్సార్సీపీ ఏపీ అసెంబ్లీ నియోజకవర్గ  సమన్వయకర్తల సమావేశం లోటస్ పాండ్ లో ప్రారంభమైంది. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ అధ్యక్షతన జరగుతున్న ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ పరిశీలకులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, రాష్ట్ర స్థాయి అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఆయా జిల్లాల అధ్యక్షులు, పరిశీలకులు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు.

మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా జూలై 8వ తేదీన గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం కార్యక్రమం ప్రారంభమైంది. క్షేత్రస్థాయిలో ఈకార్యక్రమం సాగుతున్న తీరుతెన్నులను సమావేశంలో సమీక్షిస్తున్నారు.  
Back to Top