సీఎం ప్రోద్భలంతోనే దాడులు

కర్నూలు: చంద్రబాబు ప్రోద్భలంతోనే టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. చక్రపాణిరెడ్డిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. నంద్యాల పోలింగ్‌ సరళి చూసిన టీడీపీ నేతలు అరాచకాలకు తెర లేపారన్నారు. శిల్పా కుటుంబం వైయస్‌ఆర్‌సీపీలో చేరడంతో జీర్ణించుకోలే దాడులకు పాల్పడుతున్నారన్నారు. శిల్పా మోహన్‌రెడ్డి సౌమ్యుడని, ఆయన చక్రపాణిరెడ్డి  నైతిక విలువలకు కట్టుబడి ఉన్నారని జీర్ణించుకోలేని టీడీపీ నేతలు ఆ కుటుంబంపై కక్షగట్టిందన్నారు. చక్రపాణిరెడ్డిని ఏదో చేయాలనే ఉద్దేశంతోనే దాడులకు దిగుతున్నార ని నిప్పులు చెరిగారు. అధికార దాహంతో ఏం చేసినా చెల్లుతుందని అహంకారంతో ఇలాంటి  అరాచకాలలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబే మైక్‌ పట్టుకొని బహిరంగంగా ప్రజలను బెదిరిçస్తుంటే.. ఆయన్ను చూసి టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారన్నారు. ఏడాది కాలంగా కర్నూలులో హత్యారాజకీయాలకు తెర లేపారని ఆందోళన వ్యక్తం చేశారు. నంద్యాలలో ఎన్ని రకాలుగా వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులను రెచ్చగొట్టినా మేం సంయమనంతో పాటించామన్నారు. పోలీసులు టీడీపీ నేతలకు తొత్తులుగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top