ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ కేంద్రం కోవర్టు

కడప, 13 అక్టోబర్ 2013:

సమైక్యవాదినని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆ ముసుగులో దొంగాట ఆడుతున్నారని వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్రానికి కోవర్టుగా పనిచేస్తున్నారని నిప్పులు చెరిగారు. సమైక్య ఉద్యమాన్ని ఆయన నీరుగారుస్తున్నారని ఆరోపించారు. పై లిన్ తుపా‌న్‌ బూచి చూపించి విద్యుత్ ఉద్యోగులను ఉద్యమానికి కిరణ్‌కుమార్‌రెడ్డి దూరం చేశారన్నారు. మరో పక్కన సరైన హామీ ఏదీ ఇవ్వకుండానే ఆర్టీసీ కార్మికుల సమైక్య ఉద్యమాన్ని రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నీరుగార్చారని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు.

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిజంగా సమైక్యవా‌దే అయితే సమైక్య శంఖారావం సభకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ నెల 19న సభకు అనుమతిస్తే లక్షల మంది సమైక్యవాదాన్ని దేశానికి వినిపించే అవకాశం ఉందని తెలిపారు. ఏ కారణమూ లేకుండా ఆమరణ దీక్ష చేసిన ఘనత ప్రపంచంలో చంద్రబాబు ఒక్కరిదే అని ఎద్దేవా చేశారు. విజనను వేగవంతం చేసేందుకే చంద్రబాబు ఢిల్లీ వెళ్ళి మరీ దీక్ష చేశారని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

Back to Top