'సీఎం సొంత జిల్లాలోనే పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు'

సంగారెడ్డి: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సొంత జిల్లాలోనే రైతు ఆత్మహత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నర్ర భిక్షపతి విమర్శించారు. 
శుక్రవారం ఆయన సంగారెడ్డిలో విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయ సంక్షోభం ఏర్పడి, పెట్టిన పెట్టుబడులు రాక, ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సాహం లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రభుత్వం వారికి భరోసా ఇవ్వకపోవడం సరికాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు సదస్సులు నిర్వహించి రైతుల్లో మనోధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గ్రామాగ్రామాన అవగాహన సదస్సులు నిర్వహించి రైతులకు ధైర్యం ఇస్తే ఆత్మహత్యలు కొంతవరకు నివారించడం సాధ్యమవుతుందన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయం అందంచడంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, మూడెకరాల పొలం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Back to Top