సొంత జిల్లా ప్రజలను పట్టించుకోని సీఎం

  • నగరిలో వెటర్నరీ ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించిన రోజా
  • డాక్టర్లు,మందులు, సరైన సౌకర్యాలు లేకపోవడంపై ఆగ్రహం
  • నగరి నియోజకవర్గంపై బాబు చిన్నచూపు చూస్తున్నారని ఫైర్
  • రాజకీయాలు పక్కనబెట్టి ప్రజలను ఆదుకోవాలని హితవు

  • చిత్తూరు(నగరి): చంద్రబాబు తన సొంత జిల్లాలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. 
    న‌గరి నియోజ‌క‌వ‌ర్గంపై చంద్రబాబుకు,  ప్ర‌భుత్వాధికారుల‌కు ఎందుకంత చిన్న‌చూపు అని  రోజా ప్రశ్నించారు.  నగరి నియోజ‌వ‌వ‌ర్గంలో వెట‌ర్న‌రీ ఆస్పత్రి భ‌వ‌నాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా రోజా విలేక‌రుల‌తో మాట్లాడుతూ... భ‌వ‌నాలు నిర్మించారు త‌ప్ప అందుకు సంబంధించిన సిబ్బందిని నియ‌మించ‌లేద‌ని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  కొన్ని భ‌వ‌నాల నిర్మాణాలు పూర్తైనా సిబ్బంది లేని కార‌ణంగా అవి నిరూప‌యోగంగా ఉన్నాయ‌ని  ఆవేదన వ్యక్తం చేశారు. 

    డాక్ట‌ర్లు, మందులు,  స‌రైన సౌక‌ర్యాలు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో లేవ‌ని ఆమె వాపోయారు. పుత్తూరులో రెగ్యుల‌ర్ డాక్ట‌ర్‌గా విధులు నిర్వ‌హిస్తూనే న‌గరిలో ఇంఛార్జ్ డాక్ట‌ర్‌గా విధులు నిర్వహించడం కష్టంగా ఉందని వైద్యులు చెబుతున్నారని, దీనిపై క‌లెక్ట‌ర్ ఎందుకు స్పందించ‌డం లేదని రోజా నిలదీశారు.  ప్ర‌తిప‌క్ష పార్టీ ఎమ్మెల్యేల‌కు చెడ్డ‌పేరు తీసుకొచ్చేందుకే అధికార ప్ర‌భుత్వం ఇలాంటి ధ్వంధ వైఖ‌రిని అవ‌లంభిస్తుంద‌ని విమ‌ర్శించారు. ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు రాజ‌కీయాల‌ను ప‌క్క‌న‌పెట్టి ప్రజలను ఆదుకోవాలని సూచించారు. 

తాజా వీడియోలు

Back to Top