దీక్ష పేరుతో బాబు క‌ప‌ట నాట‌కం

 

అమరాపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు  దీక్ష పేరుతో క‌ప‌ట నాట‌కం ఆడార‌ని  ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అమరాపురంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో  ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు డాక్టర్లను దగ్గర పెట్టుకుని ఏసీల్లో దీక్ష చేయడం రాష్ట్ర ప్రజలు గమనించారన్నారు. హోదా వద్దు ప్యాకేజీ ముద్దు అన్న చంద్రబాబు ఇప్పుడు యూటర్న్‌ తీసుకుని మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి కపట నాటకాన్ని ప్రదర్శిస్తున్నాడన్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దీక్ష చేయడానికి రూ.70కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. ప్రత్యేక హోదా కోసం వైయ‌స్ఆర్‌సీపీ  అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్లుగా పోరాడుతున్నారని గుర్తు చేశారు. 


Back to Top