రాజధాని రోడ్లపై శుద్ధి కార్యక్రమం

అమరావతిః   రాజధాని రోడ్లపై వైయ్ససార్సీపీ నేతలు, రైతులు, కూలీలు శుద్ధి కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రానికి అరిష్టం పోవాలని చంద్రబాబు తిరిగిన రోడ్లపై గోపంచకంతో శుద్ధి చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజధానిలో టీడీపీ నేతలు బినామీలుగా మారారని మండిపడ్డారు. మూడు పంటలు పండే భూమిని లాక్కోవడంతో రైతులు వలసలు పోతున్నారని..రైతు కూలీల పరిస్థితి దుర్భరంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ జగన్ పర్యటనను జీర్ణించుకోలేక అధికార పార్టీ తమపై తప్పుడు కేసులు పెడుతోందని, రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని నేతలు స్పష్టం చేశారు.

Back to Top