ఆయన వైయస్సార్సీపీలో లేరు

హైదరాబాద్‌

 : చిత్తూరు జిల్లాకు చెందిన సీకే బాబు, ఆయన కుటుంబ సభ్యులు తమ పార్టీలో లేరని వైయస్సార్‌ సీపీ తెలిపింది. పార్టీతో వారికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. సీకే బాబు కుటుంబ సభ్యులు ఇటీవల విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాము వైయస్సార్‌ సీపీలో ఉన్నామంటూ.. పార్టీ సీనియర్‌ నాయకులు, ఇతర నేతలను నిందించారు. ఇవన్నీ పార్టీ నాయకత్వం దృష్టికి రావడంతో సీకే బాబు, ఆయన కుటుంబ సభ్యులు తమ పార్టీలో లేరన్న విషయాన్ని వైయస్సార్‌ సీపీ స్పష్టం చేసింది. ఈ మేరకు వైయస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

Back to Top