వైయస్‌ జగన్‌ అంకితభావం నచ్చింది


– జనసునామీలో టీడీపీ కొట్టుకుపోవడం ఖాయం
పశ్చిమ గోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిలోని అంకిత భావం తనకు నచ్చిందని సినీ నటుడు పృథ్వీ పేర్కొన్నారు. ప్రజా సంకల్ప యాత్ర 175వ రోజు ఆయన వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా పృథ్వీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయాలనే తపన ఉంటేనే వేల కిలోమీటర్లు నడుస్తారన్నారు. 2019లో వచ్చే జన సునామీలో టీడీపీ కొట్టుకుపోతుందని సినీ నటుడు పృథ్వీ హెచ్చరించారు. ప్రజల మనసులో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఎలా నిలిచిపోయారో వైయస్‌ జగన్‌ కూడా ప్రజల మనస్సుల్లో అలా నిలిచిపోతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇంకా చాలా మంది నటులు వైయస్‌ జగన్‌ పాదయాత్రలో పాల్గొంటారని చెప్పారు. వైయస్‌ జగన్‌లోని అంకితభావం మాకు చాలా బాగా నచ్చిందన్నారు. జనం స్వచ్ఛమైన పాలన కోరుకుంటున్నారని, ఎవరు ఎన్ని రకాలుగా కుట్రలు చేసిన  అంతిమ విజయం వైయస్‌ఆర్‌సీపీదే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 
 
Back to Top