సామాన్య కార్యకర్తగా కష్టపడి పనిచేస్తా
వైయస్‌ జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం
జననేత పోరాట పటిమ నచ్చి పార్టీలో చేరాను
తూర్పుగోదావరి: సామాన్య కార్యకర్తగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలుపుకోసం, వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయడానికి కష్టపడతానని సినీనటుడు కృష్ణుడు అన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ సీనియర్‌ నాయకుడు పెన్మత్స సాంబశివరావు మనవడు, సినీనటుడు కృష్ణుడు వైయస్‌ జగన్‌ సమక్షంలో వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిత్యం ప్రజల్లో ఉంటూ.. వారి సమస్యలు తెలుసుకుంటూ.. నిరంతరం వారి బాగుకోసం వైయస్‌ జగన్‌ పోరాటం చేస్తున్నారన్నారు. భారతదేశ చరిత్రలోనే ఇంతటి ప్రజాదరణ ఉన్న నాయకుడు ఉండరన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విపరీతమైన ఎండలున్నా ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ఏమాత్రం బెడవకుండా పాదయాత్ర చేశారన్నారు. జననేత పోరాట పటిమ నచ్చిందని, అందుకే వైయస్‌ఆర్‌ సీపీలో చేరానన్నారు. రాష్ట్రమంతా పర్యటించడం మామూలు విషయం కాదన్నారు. ప్రజల నుంచి పాదయాత్రకు విశేష స్పందన లభిస్తుందన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కరి మనసుల్లో నిలిచిపోయే పథకాలు.. ఆయన ఆశయ సాధన కోసం వైయస్‌ జగన్‌ పనిచేస్తున్నారు. పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తానని చెప్పారు. 
Back to Top