జననేత సంకల్పం ముందు ఏదీ నిలబడదు

2019లో క్లీన్‌స్వీప్‌ చేసి అధికారం చేపడతారు
ప్రభుత్వ వైఫల్యాలే ప్రజాధరణకు నిదర్శనం
మా నాయకుడి చేత సినిమా ప్రజల్లోకి వెళ్లడం సంతోషం
తూర్పుగోదావరి: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌స్వీప్‌ చేసి అధికారం చేపడుతుందని సినీనటుడు ఫృధ్వీ అన్నారు. 213వ రోజు ప్రజా సంకల్పయాత్రలో సినీనటుడు ఫృధ్వీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన మైడియర్‌ మార్తాండం సినిమా టీజర్‌ను జననేత చేత రిలీజ్‌ చేయించారు. అనంతరం ఫృధ్వీ మీడియాతో మాట్లాడుతూ.. మా నాయకుడి చేతుల మీదుగా నా సినిమా ప్రజల్లోకి వెళ్లడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజా సంకల్పయాత్రకు ప్రజాదరణ మామూలుగా లేదని, ప్రభుత్వ వైఫల్యాలే నిదర్శనమన్నారు. 213 రోజులుగా ప్రజల కోసం.. వారి కష్టాలు తెలుసుకునేందుకు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 175వ రోజు ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్నానని, 45 డిగ్రీల ఎండలో కూడా అలుపన్నదే లేకుండా ప్రజలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకున్నారన్నారు. వైయస్‌ జగన్‌ సంకల్పం ముందు ఎండైనా.. వానైనా ఏదీ నిలబడదన్నారు. మహిళలు, రైతులు, మైనార్టీలు, అన్ని రకాల కుల వృత్తుల వారి నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. 

పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి రోడ్డు కం రైల్వే బ్రిడ్జీ నుంచి సాగిన జననేత పాదయాత్రను చూసేందుకు రెండు కళ్లు సరిపోలేదని ఫృధ్వీ అన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి, వైయస్‌ జగన్‌పై ప్రజల్లో ఉన్న అభిమానం.. వైయస్‌ఆర్‌ సీపీ సిద్ధాంతాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయన్నారు. ప్రజలంతా వైయస్‌ఆర్‌ సీపీవైపే ఉన్నారని, తుఫాన్‌ వచ్చే ముందు వాతావరణం ఎలా ఉంటుందో అలాగే క్లీన్‌ స్వీప్‌ చేసి రాష్ట్రంలో వైయస్‌ఆర్‌ సీపీ అధికారం చేపడుతుందన్నారు. 
 
Back to Top