వైయస్‌ జగన్‌ రియల్‌ హీరో

ఫస్ట్‌ టైమ్‌ ప్రజల కోసం పోరాడే నాయకుడిని చూశా
ప్రజల పట్ల వైయస్‌ జగన్‌ ఎట్రాక్షన్‌ కన్నీరు పెట్టించింది
ముఖ్యమంత్రి కావాల్సిన వ్యక్తి ఎలా ఉండాలో లైవ్‌లో చూశా
వైయస్‌ జగన్‌తో నడిచిన 4 గంటలు 4 నిమిషాల్లా అయిపోయాయి
వైయస్‌ జగన్‌ కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నా
ఎన్నికుట్రలు చేసినా వెంట్రుకలా తీసేసి ప్రజల కోసం పోరాడుతున్నారు
మా నాన్న తరువాత వైయస్‌ జగన్‌ నా రియల్‌ హీరో
తూర్పుగోదావరి: వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రియల్‌ హీరో అని సినిమాటోగ్రాఫర్‌ చోటాకే నాయుడు అన్నారు. సినిమాల్లో ఎంతోమంది హీరోలను చూశాను కానీ.. ప్రజల కోసం పోరాడే ఒక రియల్‌ హీరోను ప్రత్యక్షంగా చూడడం ఇదే మొదటిసారి అని అన్నారు. మండపేట నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌తో కలిసి చోటాకేనాయుడు పాదయాత్ర చేశారు. సుమారు 4 గంటల పాటు జననేతతో కలిసి నడిచిన తన అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు. ఈ సందర్భంగా చోటకేనాయుడు ఏం మాట్లాడారో ఆయన మాటల్లోనే.. మహానేత వైయస్‌ఆర్‌ను రెండు సార్లు కలిశాను.. వైయస్‌ఆర్‌ పాదయాత్ర, ప్రజలతో ఆయనకున్న అనుబంధాన్ని టీవీల్లో చూశాను. ఫస్ట్‌ టైమ్‌ ప్రజల కోసం పోరాడే నాయకుడిని చూశాను. వైయస్‌ జగన్‌ చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఆయన మాట్లాడే విధానం ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రజల కోసం ఇంత దూరం సరిగ్గా రోడ్లు లేని ప్రాంతంలో నడుస్తున్నారు. ఆయన్ను కలవడానికి వచ్చిన వృద్ధులను అవ్వా.. అవ్వా అని పిలిచి దగ్గరకు తీసుకొని మరీ మాట్లాడుతున్నారు. ఆ ఎట్రాక్షన్‌ చూసి కన్నీరు వచ్చింది. ప్రజా నాయకుడు, ఒక ముఖ్యమంత్రికి కావాల్సిన వ్యక్తి ఎలా ఉండాలో.. లైవ్‌లో మొదటిసారి చూశాను. 

వైయస్‌ జగన్‌తో కలిసి 4 గంటల పాటు నడిచిన సమయం మంచి అనుభవాన్ని నేర్పింది. ఒక హీరోకు ఉండాల్సిన లక్షణాలు వైయస్‌ జగన్‌కే ఉన్నాయి. ప్రజల మేలు కోసం ఆరాటపడే మనిషి కోసం ఏమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వైయస్‌ జగన్‌ సంపూర్ణంగా ఉండాలి. ఉంటారు.. ఆయన ఒక లయన్‌. పాదయాత్రలో ఒకరు వచ్చి పేపర్‌ ఇస్తే నడుస్తూనే దాన్ని చదవుతున్నారు. ఇంకొకరు వచ్చి పేదవారి భూములు కబ్జా చేశారని ఫొటోలు చూపిస్తూ అక్రమార్కులపై కోపం వస్తున్నా.. ఓపికతో నేను మాట్లాడుతానని చెప్పి పంపించారు. పొలం పనులు చేసి బురదతో వచ్చిన వారిని కూడా ఆప్యాయంగా పలకరిస్తూ అక్కున చేర్చుకొని వారి కష్టాలు వింటూ నవ్వుతూ మాట్లాడుతున్నారు.. ఒకటి కాదు.. ఆయన గురించి చెప్పాలంటే 5 గంటల చెప్పాల్సిన మ్యాటర్‌ ఉంది. 

వైయస్‌ జగన్‌ వారి తండ్రి వైయస్‌ఆర్‌ పేరు నిలబెడుతారు. ఒకప్పుడు ఎంజీఆర్‌కు ఇంతటి ప్రజాధరణ ఉండేదని విన్నా.. కానీ ఇప్పుడు వైయస్‌ జగన్‌ ఫాలోయింగ్‌ లైవ్‌లో చూశాను. వైయస్‌ఆర్‌ వంద అనుకుంటే వైయస్‌ జగన్‌ ఒక లక్ష.. అనుకున్నది ముక్కుసూటిగా చెప్పే వ్యక్తి. ఊరికే అందరూ వైయస్‌ జగన్ను బదనాం చేశారు. ఎల్లోమీడియా లేనిపోనిది చెప్పి ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించారు. అవన్నీ అవాస్తవాలు వైయస్‌ జగన్‌ రియల్‌ మ్యాన్‌. మీకు నేను పెద్ద అభిమానిని అంటే ఎందుకు అని అడిగారు.. ఏమీ లేకుండానే జైల్లో పెట్టి హింసించిన వాటన్నింటినీ వెంట్రుకలా తీసిపారేసి ప్రజల కోసం పోరాడుతున్నారు. అందుకే మీరంటే ఇష్టం. మా నాన్న తరువాత మీరే నా రియల్‌ హీరో అని చెప్పాను. ఈ ముక్క చెప్పడానికి నాకు 4 గంటలు పట్టింది. యూత్‌ అంతా వైయస్‌ జగన్‌ సీఎం.. సీఎం.. అని, మహిళలు వచ్చి మీరు రండన్న.. దేవుడన్నా.. అని అంటున్నారు. అంటే వైయస్‌ జగన్‌ రాష్ట్ర ప్రజల గుండెల్లో దేవుడిస్థానం సంపాదించారు. 

రాజమండ్రి– కొవ్వూరు బ్రిడ్జి మీద జనజాతర చూసి ఆశ్చర్యపోయాను. ఆ జనాన్ని చూసి బ్రిడ్జి పడిపోతుందేమోనని భయమేసింది. వైయస్‌ జగన్‌తో కలిసి నడిచిన నాలుగు గంటలు నాలుగు నిమిషాల్లో అయిపోయింది. మనుషుల ప్రేమే ఆయన్ను నడిపిస్తుంది. వైయస్‌ జగన్‌ పాదయాత్రలో పాల్గొని ఆయనతో నడవడంతో నాలో కొత్త ఎనర్జీ వచ్చింది. దీంతో ఇంకో 40 ఏళ్లు బతికేస్తా. 
Back to Top