వైయస్‌ జగన్‌ను కలిసిన చోటా కే నాయుడు
తూర్పు గోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. వైన్ఎ జగన్‌ చేస్తున్న ప్రజాసంకల్పయాత్రకు ప్రజలు, కార్యకర్తలే కాకుండా సినీ ప్రముఖలు తమ మద్దతు తెలియచేస్తున్నారు. తాజాగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ చోటా కే నాయుడు వైన్ఎ జగన్‌ను కలిశారు. సోమవారం, మండపేట నియోజకవర్గం సోమేశ్వరంలో జరుగుతున్న ప్రజాసంకల్పయాత్రలో జననేతను కలిసి తమ మద్దతును తెలియచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజన్న రాజ్యం రావాలంటే వైన్ఎ జగన్‌ ముఖ్యమంత్రి అవ్వాలని అన్నారు. గతంలో ప్రజాసంకల్పయాత్రలో ప్రముఖ సినీనటులు పోసాని కృష్ణమురళి, పృధ్వీలు వైన్ఎ జగన్‌ను కలిసిన సంగతి తెలిసిందే. .

Back to Top