వైయస్సార్సీపీలోకి చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు

చిత్తూరు(తంబళ్లపల్లె))ముఖ్యమంత్రి చంద్రబాబు మోసాలను గుర్తించాం. ఆయన పాలనలో సంక్షేమ పథకాలు అందక నష్టపోయాం. రాజన్న పాలనకోసం వై/స్సార్‌సీపీలో చేరుతున్నాం’’ అంటూ టీడీపీ నాయకులు బాహటంగా తెలిపారు. వైయస్‌ఆర్‌సీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీలోని పలు పల్లెల నుంచి పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. రామసుబ్బారెడ్డి, గంగుల్‌రెడ్డి, సిద్దారెడ్డి, వి.వెంకటరమణ, శేఖర్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, మురళీ, చలపతి, ఏ.వెంకటరమణ, మనోహర్, రామాంజులురెడ్డి, ఎరుకులరెడ్డి తదితరులకు ద్వారకనాథరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.


Back to Top