చెంగల్‌ పండు కుటుంబానికి ఎమ్మెల్యే ప‌రామ‌ర్శ

చంద్ర‌గిరి

:  రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతి చెందిన చెంగల్‌ పండు కుటుంబాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా చెంగల్‌ పండు చిత్రపటానికి ఆయన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మృతుడు భార్య నిరంజని, కుమారులు శేఖర్, భరత్‌లను పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ చెంగల్‌ పండు మృతి పార్టీకి తీరని లోటన్నారు. గత ఎన్నికల్లో ఎంతో చురకైన పాత్ర పోషించి, పార్టీకు విధేయుడుగా పనిచేసారన్నారు. అటువంటి వ్యక్తి అకాల మరణం పొందడం దురదృష్ఖకరమని ఆయన విచారణ వ్యక్తం చేశారు. అనంతరం చెంగల్‌ పండు కుమారులైన శేఖర్, భరత్‌లను పరామర్శించి, వారికి తప్పకుండా జీవానధారం లభించేలా ఇద్దరికి ఉపాధి కల్పిస్తానని, మీ కుటుంబానికి ఎటుంటి కష్టం వచ్చినా పెద్ద కొడుకులా ముందుటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కొటాల చంద్రశేఖర్‌ రెడ్డి, పాకాల సీనియర్‌ నాయకుడు చెన్నకేశవ రెడ్డి, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మీ, డాక్టర్‌ రెడ్డప్ప, మాజీ ఉప సర్పంచ్‌ గోపాల్, ఉమ తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top