వైయస్సార్‌ సీపీ కార్యకర్తకు కొండేటి పరామర్శ

ఎల్‌.గన్నవరం (పి.గన్నవరం) : లంకల గన్నవరం శివారు నడిగాడి గ్రామంలో పుత్ర వియోగంతో భాదపడుతున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త చికిలే మోహనరావును నియోజకవర్గ కోఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు సోమవారం పరామర్శించారు. మోహనరావు కుమారుడు రామకృష్ణ (40) ఇటీవల మరణించాడు. పార్టీ జిల్లా నాయకులు యన్నాబత్తుల వెంకటేశ్వరరావు, పాటి చిట్టిబాబు, గ్రామశాఖ అధ్యక్షుడు యన్నాబత్తుల ఆనంద్‌ కుమార్, యన్నాబత్తుల కిరణ్‌ కుమార్, పెమ్మాడి సత్యనారాయణ, చందాడి వెంకట నారాయణ, యన్నాబత్తుల సూర్య చంద్రరావు, కొల్లి రవి కుమార్, గూటం నాగరాజు, యన్నాబత్తుల అరుణ్‌ కుమార్, నాగాబత్తుల రవి కుమార్, మానకొండ గణపతి, పమ్మి అర్జునరావు, పమ్మి చిట్టి, సరెళ్ల రాము, సరెళ్ల లక్ష్మణ్, నక్కా సెల్వరాజ్‌ తదితరులు మోహనరావును పరామర్శించిన వారిలో ఉన్నారు.

Back to Top