బాబుకు బుద్ధి చెప్పే సమయం ఆసన్నం


ప్రకాశం: మనందరికి భరోసా కల్పించేందుకు వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారని బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. చంద్రబాబుకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో బీజేపీ, టీడీపీలు ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతిలో హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. ప్యాకేజీని స్వాగతించిన చంద్రబాబు తెలుగు ప్రజలను దగా చేశారన్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా అందరూ కోరుతుండటంతో మంత్రుల రాజీనామా అంటూ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. 
Back to Top