సేవాకార్యక్రమాల్లో వైయస్సార్‌ సీపీ యూత్‌ కన్వీనర్‌

ఉత్తరచిరువోలులంక(మోపిదేవి): వైయస్సార్‌సీపీ మండల యూత్‌ కన్వీనర్‌ చింతా శ్రీనివాసరావు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో బాగంగా శనివారం మూడు పంచాయతీలు ఉత్తరచిరువోలులంక, మేళ్లమర్తిలంక, కోసూరువారిపాలెం గ్రామాల్లో వారి తాత కొక్కిలిగడ్డ నరసింహారావు జ్ఞాపకార్థం మనవడు శ్రీనివాసరావు గ్రామస్తులు కూర్చునేందుకు సిమెంట్‌ బల్లలు ఏర్పాటు చేశారు. మూడు పంచాయతీల్లోనూ ప్రధాన కూడలిలో 35 సిమెంట్‌ బల్లలు ఏర్పాటు చేయనున్నట్లు అందులో 20 బల్లలు ఉత్తరచిరువోలులంకలోనే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతకుముందు కూడా పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు నోట్‌ పుస్తకాలతో పాటు ఇనుప బీరువా, పంచాయతీకు మార్చురీ బాక్స్‌ను అందచేసినట్లు దాత చింతా తెలిపారు. నాగినేని ధనుంజయరావు, పాలకేంద్రం అధ్యక్షుడు రెడ్రోతు వెంకట రమణ, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు రెడ్రోతు రాంప్రసాద్, ఉప్పాల ఏడుకొండలు, రెడ్రోతు నారాయణ, పులిగుజ్జు నాగమల్లేశ్వరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top