అక్క‌డ అలా...! ఇక్క‌డ ఇలా..!


తెలుగుదేశం ప్ర‌భుత్వం
అరాచ‌కం మ‌రోసారి బ‌య‌ట ప‌డింది.

క‌ర్నూలు జిల్లాలో
మ‌హిళా ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ను చుట్టుముట్టి పోలీసులు దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తుంటే
ఆమె తండ్రి భూమా నాగిరెడ్డి అడ్డుకోబోయారు. ఈ క్ర‌మంలో తాను ప్ర‌జా ప్ర‌తినిధిని..తాక
వ‌ద్ద‌న్నందుకు గాను, టీడీపీ నేత‌లు ఒత్తిడి చేయించి పోలీసుల‌తో అక్ర‌మ కేసులు పెట్టించారు.
అక్క‌డిక‌క్క‌డ అరెస్టు చేసి జైలుకి త‌ర‌లించారు. అనారోగ్యం తో బాధ‌ప‌డుతుంటే క‌నీసం
ఉన్న‌త స్థాయి చికిత్సకు అనుమతించ‌లేదు.

 

అదే కృష్ణా జిల్లాలో
విధి నిర్వ‌హ‌ణలో ఉన్న మ‌హిళా త‌హ‌శీల్దార్ మీద తెలుగుదేశం ఎమ్మెల్యే చెల‌రేగిపోయారు.
ఇసుక అక్ర‌మ ర‌వాణాను అడ్డుకొన్నందుకు గాను ఆమెను జుట్టు ప‌ట్టి ఈడ్పించారు. ఆమె సెల్
ఫోన్ ధ్వంసం చేసి అనుచ‌రుల‌తో చుట్టుముట్టి వీరంగం వేశారు. ఇదంతా ఒక పోలీసు స‌బ్ ఇన్
స్పెక్ట‌ర్‌, ఇత‌ర పోలీసుల స‌మ‌క్షంలోనే జ‌రిగింది. ఎమ్మెల్యే దుర్భాష లాడుతూ చెల‌రేగుతుంటే
పోలీసులు చోద్యం చూస్తూ నిలిచిపోయారు.

 

వ్య‌వ‌స్థ ను
చంద్ర‌బాబు, తెలుగుదేశం నాయ‌కులు ఏ స్థాయిలో భ్ర‌ష్టు ప‌ట్టించారో అర్థం అవుతోంది.
ఒక వైపు కుమార్తెను కాపాడుకొనేందుకు ఒక తండ్రి ఆరాట ప‌డితే ప‌చ్చ చొక్కాల ఒత్తిడి మేర‌కు
నిస్సిగ్గుగా అక్క‌డ‌కు అక్క‌డ అరెస్టు చేసి జైలుకి పంపించారు. ఇక్క‌డ మాత్రం అధికార
తెలుగుదేశం ఎమ్మెల్యే అంద‌రి ముందు విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఒక త‌హ‌శీల్దార్ ను జుట్టు
ప‌ట్టి ప‌క్క‌కు లాగేసి నెట్టేస్తే పోలీసులు ప్రేక్ష‌క పాత్ర వ‌హించారు. కొన్ని గంట‌ల
త‌ర్వాత నామ మాత్రంగా కేసు న‌మోదు చేసి చేతులు దులుపుకొన్నారు. ఇదీ ఈ రాష్ట్ర పోలీసుల
ఘ‌న‌త‌..!

Back to Top