వైయస్‌ జగన్‌కు చిన్నారుల చిరు కానుక
– కిడ్డీ బ్యాంక్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన చిన్నారి మధులత
- జననేత కోసం మస్కట్‌ నుంచి వచ్చిన అభిజ, అభీష
 
తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ వెంట అన్ని వర్గాల ప్రజలు కలిసి నడుస్తున్నారు. చివరకు చిన్నారులు కూడా మేము సైతం అంటూ అడుగులో అడుగులు వేస్తున్నారు. ఈ జనజాతరకు పెద్దలే కాదు..చిన్నారులు మేము సైతం అంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సత్యమధులత అనే చిన్నారికి వైయస్‌ జగన్‌ అంటే చాలా అభిమానం. తాను దాచుకున్న కిడ్డీ  బ్యాంకును మధులత వైయస్‌ జగన్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారు. నవరత్నాలకు ఆ డబ్బులు ఉపయోగించాలని ఆ చిన్నారి వైయస్‌ జగన్‌ను కోరారు. అలాగే మస్కట్‌ నుంచి అభిజ, అభిష అనే చిన్నారులు వచ్చి వైయస్‌ జగన్‌ను ప్రజా సంకల్ప యాత్రలో కలిశారు. వీరికి వైయస్‌ఆర్‌కుటుంబం అంటే ఎల్లలు లేని ప్రేమ అందుకే వైయస్‌ జగన్‌ను కలిసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. వైయస్‌ జగన్‌ను కలవడంతో తమ కల నెరవేరిందని ఎంతో సంతోషంతో చెప్పారు. తూర్పు గోదావరికి చెందిన వీరి తండ్రి ఇమ్మానుయేలు మస్కట్‌లో ఇంగ్లీష్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. రాష్ట్రానికి వైయస్‌ జగన్‌ లాంటి యంగ్‌ లీడర్‌ అవసరమని ఇమ్మానుయేలు అభిప్రాయపడ్డారు. 
 
Back to Top