ప్రభుత్వ నిర్లక్ష్యంతో పసికందు మృతి

విజయవాడః  రాష్ట్రంలో పాలన పడకేయడంతో ప్రభుత్వాసుపత్రులు మృత్యుఘంటికలు మోగిస్తున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం మరో ప్రాణాన్ని బలగొంది.  ఇటీవలే గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఎలుకలు కరిచి ఓ పసికందు చనిపోయిన ఘటన మరవకముందే...విజయవాడలో మరో విషాదం చోటుచేసుకుంది. విజయవాడలోని  ప్రభుత్వాసుపత్రిలో చీమలు కరవడంతో నాలుగు రోజుల పసికందు మృతి చెందింది. గత సంఘటనలు గుణపాఠం నేర్పినా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. రోగుల మధ్యే ఎలుకలు,పాములు, చీమలు స్వైరవిహారం చేస్తున్నా చంద్రబాబు సర్కార్ మొద్దు నిద్ర వీడడం లేదు. 

వివరాల్లోకి వెళితే.....విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోని పిల్లల విభాగంలో లక్ష్మి అనే మహిళకు నాలుగు రోజుల క్రితం సిజేరియన్ ఆపరేషన్ చేశారు. పండంటి మగబిడ్డ పుట్టడంతో అందరూ సంతోషించారు. కానీ సోమవారం తెల్లవారుజామున లేచి చూడగా.. శిశువు ఛాతీ, వీపు భాగాల్లో చీమలు కుట్టి తీవ్ర రక్తస్రావం జరిగింది. అప్పటికే శిశువు మరణించాడు. పిల్లాడిని మొత్తం చీమలు కుట్టినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా వైద్యులు మాత్రం తమ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. వైఎస్సార్సీపీ నాయకుడు నివాస్‌రెడ్డితో కలిసి ప్రభుత్వాస్పత్రి వద్దకు వెళ్లిన పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి.. ఈ వ్యవహారంపై వైద్యులను నిలదీశారు.

Back to Top