సీఎం ఉన్నచోటే శిశువు అదృశ్యం దారుణం

విజయవాడ : వైయస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధా చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానని చెబుతున్న చంద్రబాబు... సింగపూర్లోని ఆసుపత్రిలో కూడా పిల్లలను ఎత్తుకుపోతారా ? అని ప్రశ్నించారు. విజయవాడ పాత ఆసుపత్రిలో శిశువు అదృశ్యంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, కలెక్టర్, బాబుదే బాధ్యత అని వంగవీటి రాధా అన్నారు. సీఎం విజయవాడలోనే ఉంటున్నా ప్రభుత్వాస్పత్రుల్లో భద్రత లేదని మండిపడ్డారు.

Back to Top