సోషల్‌ మీడియాపై ముఖ్యమంత్రి తీరు అప్రజాస్వామికం

గుడిబండ(మడకశిర): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోషల్‌ మీడియాపై వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికమని  జిల్లా ప్రధాన కార్యదర్శి జీబీ శివకుమార్‌ తీవ్రంగా ఖండించారు. ఆయన సోమవారం గుడిబండలో విలేకరులతో మాట్లాడుతూ సోషల్‌ మీడియాపై తెలుగుదేశం ప్రభుత్వం ఆంక్షలు విధించడం చట్టవిరుద్ధమని విమర్శించారు. ముఖ్యమంత్రి తన పద్దతిని మార్చుకోకపోతే ప్రజాఉద్యమం తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపే సోషల్‌మీడియాను నియంత్రించడంముఖ్యమంత్రి తరం కాదని ధ్వజమెత్తారు. తప్పులపై పౌరులు స్పందిసున్న వాటిపై చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నామన్న అహంకారంతో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పొలిటికల్‌ పంచ్‌ నిర్వహకుడు రవికిరణ్‌ను అరెస్టు చేయడం మీడియా స్వేచ్ఛను హరించడమేనని తెలిపారు. ఇలాంటి అప్రజాస్వామిక పద్దతులను మానుకొని ప్రజలకు ఇచ్చిన హమీలను ముఖ్యమంత్రి నెరవేర్చి మంచి పేరుతెచ్చుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదని హితవు పలికారు.

Back to Top