పెద్ద తలకాయల పేర్లు బయటపెట్టాలి

  • బోటు ప్రమాదానికి ముఖ్యమంత్రిదే పూర్తి బాధ్యత
  • ఇది ప్రభుత్వ ఘోర వైఫల్యం
  • దీనివెనుక ఉన్న బడాబాబుల పేర్లు బయటకు రావాలి
  • మృతుల కుటుంబాలకు రూ.20లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి
  • కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి
  • వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్
విజయవాడః కృష్ణానదిలో జరిగిన బోటు ప్రమాదానికి ముఖ్యమంత్రి పూర్తి బాధ్యత వహించాలని వైయస్సార్సీపీ డిమాండ్ చేసింది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న బోటింగ్ ను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటుకు కట్టబెడుతున్నారని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పబ్లిక్, ప్రైవేటు పాట్నర్ షిప్  మోజుతో లంచాలకు కక్కుర్తిపడి ప్రజల ప్రాణాలను తీసే పనులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇది ప్రభుత్వ ఘోర వైఫల్యమని సురేష్ అన్నారు. దీని వెనుక ఇద్దరు మంత్రుల హస్తం ఉందని వార్తలు వస్తున్నాయని, నిజాలు నిగ్గు తేల్చి వారిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్తీకమాసం వేళ ఇలాంటి ఘటన జరగడం బాధిస్తోందన్నారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంతనూతలపాడు నుంచి కూడ బాధితులున్నారని సురేష్ చెప్పారు. విజయవాడలో పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సురేష్ మాట్లాడారు.

బోటు ప్రమాదం వెనుక ఉన్న పెద్ద తలకాయల పేర్లు బయటకు రావాల్నారు. తూతుమంత్రంగా విచారణ జరిపించడం సరికాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.మృతుల కుటుంబాలకు 20లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించడంతో పాటు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. పత్రికల్లో ఇద్దరు మంత్రుల పేర్లు వస్తున్నది వాస్తవం కాదా..? రివర్ బోటింగ్ కార్పొరేషన్ వారి పరిధిలో నడుస్తున్న బోట్ లలో నలుగురు అధికారులు అందులో భాగస్వామ్యులున్నది వాస్తవం కాదా..? వారిపై కంప్లైంట్ వచ్చినప్పుడు ఆర్నెళ్లు నిషేధించినా మరలా ఎందుకు పునరుద్ధరించారని సురేష్ ప్రశ్నించారు. ఓ మంత్రి ఫోన్ చేస్తే మళ్లీ పర్మిషన్ ఎందుకు ఇచ్చారో ఇవన్నీ నిగ్గు తేల్చాలన్నారు. 

తాజా వీడియోలు

Back to Top