చంద్రబాబు వికృత చేష్టలు

తిరుపతిః
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రబాబుపై
విరుచుకుపడ్డారు. చంద్రబాబు అధికారులను ఎవరినీ పనిచేయనీయడం లేదని
మండిపడ్డారు. ఎంతసేపు రివ్యూమీటింగ్ లు, టెలికాన్ఫరెన్స్ లంటూ అధికారులను
కార్యాలయాలకే పరిమితం చేస్తూ...వరద ప్రాంతాల్లోకి వెళ్లనీయడం లేదని ఆగ్రహం
వ్యక్తం చేశారు. 

కుండపోత వర్షాలతో పంటలు
దెబ్బతిని, ఇళ్లు మనిగిపోయి ప్రజలు తలదాచుకునే పరిస్థితి లేదని చెవిరెడ్డి
అన్నారు. అధికారులను ఫీల్డ్ లోకి పంపించకుండా చంద్రబాబు చేస్తున్న....వికృత
చేష్టలు అర్థంకాకుండా ఉన్నాయని విమర్శించారు. బాధితులకు న్యాయం జరిగే
విధంగా ప్రభుత్వం మెడలు వంచెందుకే... తమ అధ్యక్షులు వైఎస్ జగన్ వరద
ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు చెవిరెడ్డి తెలిపారు. 
Back to Top