తిరుపతి: శేషాచల అడవుల్లో జరిగింది పక్కా బూటకపు ఎన్కౌంటర్ అని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి రోపించారు. ఎక్కడో పట్టుకొచ్చి 20 మందిని కాల్చిచంపారని అన్నారు. నిజమైన ఎన్కౌంటర్ అయితే ఒకరు చనిపోయిన తర్వాత మిగతావాళ్లు పారిపోయే అవకాశముందన్నారు. కానీ సంఘటన స్థలంలో శవాలు గుట్టలగా పడివుండడంతో ఇది బూటకపు ఎన్కౌంటర్ అన్న అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు.<br/>ఈ ఘటనపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.