చెవిరెడ్డి అరెస్టు అక్రమం

ఏపీ అసెంబ్లీ: రవాణ శాఖ కమిషనర్‌పై దురుసుగా ప్రవర్తించిన టీడీపీ ఎంపీ నాని, ఎమ్మెల్యే బోండా ఉమాపై చర్యలు తీసుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్‌ పోడియం వద్ద నిరసన తెలిపారు. విజయవాడ ఆర్టీఏ వివాదాన్ని సభలో ప్రస్తవించిన ప్రతిపక్ష సభ్యులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. శాంతియుతంగా దీక్ష చేస్తున్న వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అన్యాయంగా అరెస్టు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. చెవిరెడ్డి అరెస్టు అక్రమమని నినదించారు. ఆర్టీఏ అంశంపై స్పీకర్‌ చర్చకు అనుమతించకపోవడంతో సభ్యులు పోడియం చుట్టుముట్టి నిరసన తెలిపారు. దీంతో సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.

Back to Top