సిగ్గు,శరం ఉంటే యనమల రాజీనామా చేయాలి

యనమలకు సభలో ఉండే అర్హత లేదు
టీడీపీ ప్రభుత్వాన్ని ప్రజలు, ప్రజాప్రతినిధులు..
కోర్టులు తిడుతూ తప్పుబడుతున్నాయి
మహిళలందరికీ రోజా స్ఫూర్తిదాయకం
చంద్రబాబు రోజాకి పువ్వు ఇచ్చి సభకు ఆహ్వానించాలిః చెవిరెడ్డి

హైదరాబాద్ః వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి  మంత్రి యనమలపై  తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏమాత్రం సిగ్గు, శరం ఉన్నా  యనమల తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రూల్స్ , చట్టానికి విరుద్ధంగా యనమల తీసుకున్న చర్యలను కోర్టులే తప్పుబట్టాయన్నారు. యనమల రామకృష్ణుడికి ఒక్క క్షణం కూడా సభలో కూర్చునే అర్హత లేదన్నారు. రోజాను సభలోకి రానీయకుండా అడ్డుతగిలేందుకు కుట్రలు చేయడం కాదని..పువ్వులిచ్చి స్వాగతం పలకాలని మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలకు హితవు పలికారు. నిబంధనలను కాలరాస్తూ రోజాను సస్పెండ్ చేసే అధికారం యనమలకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. 

స్పీక‌ర్‌గా, శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల మంత్రిగా ప‌ని చేశానని...తెనాలి రామ‌కృష్ణుడినని చెప్పుకునే యనమల ఇప్పుడేం సమాధానం చెబుతారని చెవిరెడ్డి ప్రశ్నించారు. ఒక ఎమ్మెల్యేను స‌స్పెండ్ చేయ‌డం, దానిని మిగ‌తా శాస‌న‌స‌భ్యులు ఆమోదించడం పట్ల సుప్రీం కోర్టు, హైకోర్టులు చెంప వాయించాయన్నారు.  హైకోర్టు తీర్పును చూసి డిసైడ్ చేస్తాం, శాస‌న‌స‌భ ఏ నిర్ణ‌యం తీసుకున్నా చెల్లుతుంది అంటూ మంత్రులు, శాసనసభ్యులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని..అలా వ్యవహరించేందుకు ఇది ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్, టీడీపీ ప్రాంతీయ కార్యాల‌యం కాదని చెవిరెడ్డి చురక అంటించారు.  సభలో కొన్ని నియ‌మాలు, నిబంధ‌న‌లు, చ‌ట్టాలు ఉంటాయని... అందరూ వాటికి అనుగుణంగా ప‌ని చేయాలన్నారు. హక్కులను ధిక్కరిస్తే ప్ర‌భుత్వానికి ఇలాంటి చెంపపెట్టు తప్పదన్న విషయం గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. 

చ‌ట్టాల‌ను గౌర‌విస్తామ‌ని చెప్పే చంద్ర‌బాబు, టీడీపీ శాస‌న‌స‌భ్యులు రోజాను గేటు ద‌గ్గ‌ర అడ్డుకోవ‌డం కాద‌ని.. స్వ‌యంగా చంద్ర‌బాబే గేటు ద‌గ్గ‌రికి వెళ్లి పూల‌బోకేతో రోజాని ఆహ్వానించాల‌ని సూచించారు. ఒక మ‌హిళకు టీడీపీ చేసిన అవ‌మానాలు వారికి గొడ్డ‌లిపెట్టులా వెంటాడుతాయ‌న్నారు. అంతేకాకుండా అసెంబ్లీ రూల్ 71ను స‌స్పెండ్ చేశార‌ని దీనిపై సైతం వైఎస్సార్‌సీపీ కోర్టుకు వెళ్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. టీడీపీ ప్ర‌భుత్వాన్ని ప్ర‌జ‌లు, ప్రజాప్ర‌తినిధులు, కోర్టులు తిడుతూ త‌ప్పుబ‌డుతున్నాయ‌ని...ఇంత దిగ‌జారిన పాల‌న భార‌తదేశంలో ఎక్క‌డా లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

మహిళలందరికీ రోజా స్ఫూర్తిగా నిలుస్తుందని చెవిరెడ్డి అన్నారు. ఓమహిళ పోరాటం చేస్తే ఏవిధంగా విజయం వరిస్తుందో రోజానే ఉదాహరణ అని చెప్పారు.  వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజాకు వైఎస్సార్‌సీపీ శాస‌న‌స‌భ్యులంద‌రం ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతామ‌న్నారు.  త‌మిళ‌నాడులో రూల్స్‌కు వ్య‌తిరేకంగా ఆరుగురు శాస‌న‌స‌భ్యుల‌ను స‌స్పెండ్ చేస్తే కోర్టు కొట్టివేసింద‌ని, ఉత్త‌ర‌ భారత‌దేశంలోని ఒక రాష్ట్రంలో  శాస‌న‌స‌భ ఇష్ట‌మొచ్చిన‌ట్లు చేస్తానంటే ఆ రికార్డుల‌న్నింటిని కోర్టు సీజ్  చేసిన విష‌యాల‌ను మీడియాకు వివ‌రించారు. 

రోజాను తిరిగి ఏదో ఓ విధంగా సభకు రానివ్వ‌కుండా చేస్తామంటున్నార‌ని, వారు రోజా ప్ర‌జాభిమానంతో గెలిచిన వ్యక్తి అని గుర్తు పెట్టుకోవాల్సిన అవ‌స‌రం  ఉంద‌న్నారు. గాలి ముద్దుకృష్ణ‌మ‌నాయుడును ఓడించి గెలిచిన వ్య‌క్తి రోజా అన్నారు. ఇలాంటి కుట్ర‌పూరిత సంఘ‌ట‌న‌ల‌కు మ‌ళ్లీ పాల్ప‌డితే ఈసారి కోర్టు కాకుండా ఏకంగా మ‌హిళ‌లు, ప్ర‌జ‌లు త‌రిమికొడ‌తార‌న్నారు. టీడీపీ మంత్రుల‌ను ప్ర‌జ‌లు జోక‌ర్ల వ‌లే చూస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. 
Back to Top