వేంకటేశ్వరస్వామికి మేల్‌చాట్‌ వస్త్రాల సమర్పణ

చిత్తూరు: తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మేల్‌చాట్‌ వస్త్రాలను అందజేశారు. తిరుపతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడోత్సవాలను పురస్కరించుకొని ప్రతి ఏటా ఇలా మేల్‌చాట్‌ వస్త్రాలను సమర్పించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలోనే సోమవారం జిల్లాలోని తుమ్మలగుంట్ల గ్రామం నుంచి భక్తి చైతన్య యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ..  అన్ని గ్రామాల్లో భక్తిని పెంపొందించేందుకు పల్లెల్లోని దేవాలయాల నుంచి బ్రహ్మోత్సవం రోజు సాంప్రదాయబద్ధంగా సారే తీసుకురావడం ఆనవాయితీకి శ్రీకారం చుట్టాం. దాన్ని అందిపుచ్చుకున్న తుమ్మలçగుంట్లæ్ల వేంకటేశ్వరస్వామి దేవాలయం నుంచి ప్రతి ఏటా స్వామివారికి తమిళనాడు నుంచి తెప్పించిన మేల్‌చాట్‌ వస్త్రాలను సమర్పించాం. ఊరేగింపుగా, కళావాయిద్యాలతో భక్తభృందాలతో కలిసి భక్తి చైతన్య యాత్రగా ఈ కార్యక్రమాన్ని చేపడుతాం. తుమ్మలగుంట్ల నుంచి ప్రారంభమైన యాత్ర పక్క గ్రామాల వారు అందుకోవడం, వారి నుంచి ఆ పై గ్రామాల వారు అందుకుంటూ ఇలా సాయంత్రానికి గరుడువాహన సమయానికి మంగాపురం చేరుకుంటాం. ఈ వస్త్రాలను శుక్రవారం స్వామి వారికి అలంకరిస్తారు.

Back to Top