జైల్లోనే చెవిరెడ్డి దీక్ష

డంపింగ్‌ యార్డు ఎత్తివేయాలని డిమాండ్‌
చెవిరెడ్డి అక్రమ అరెస్ట్ కు నిరసనగా కేసీపేటలో ఆందోళనలు

చిత్తూరు: రామాపురం డంపింగ్‌ యార్డు ఎత్తివేసే వరకు పోరాటం ఆగదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు. డంపింగ్‌ యార్డును ఎత్తివేయాలని కోరుతూ రామాపురం వద్ద చెవిరెడ్డి చేస్తున్న దీక్షను పోలీసులు అక్రమంగా అడ్డుకొని దీక్షను భగ్నం చేసి అరెస్టు చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో చిత్తూరు జైల్లో ఉన్న చెవిరెడ్డి గత నాలుగు రోజులుగా ఆహారం తీసుకోకుండా దీక్ష కొనసాగిస్తున్నారు. ఆయనతో పాటు మరో 35 మంది వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలు దీక్షలు చేస్తున్నారు. ప్రభుత్వం రామాపురం డంపింగ్‌ యార్డును ఎత్తివేయాలని చెవిరెడ్డి డిమాండ్‌ చేస్తున్నారు.

తిరుపతి రూరల్‌లో..
ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ తిరుపతి రూరల్‌ మండలం కేసీపేటలో వైయస్‌ఆర్‌ సీపీ నేత మూలం బాబు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో రాచరిక పరిపాలన కొనసాగిస్తుందని మండిపడ్డారు. ధర్నాలో పార్టీ నేతలు చంద్రశేఖరరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, గోపి, మునీశ్వరరెడ్డి, మాధవరెడ్డి, మునిస్వామి యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.
Back to Top