చేతగాని దద్దమ్మ ప్రభుత్వం..!

రైతుల గుండెలు ఆగుతున్నా పట్టదా..!
చంద్రబాబు రాష్ట్రానికి పట్టిన శని..!

హైదరాబాద్ః వైఎస్సార్సీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కరువుతో అల్లాడుతుంటే 196 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించడం దుర్మార్గమన్నారు. ఇంతకన్నా మోసం మరొకటి ఉండదని పద్మ ధ్వజమెత్తారు. చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా కృష్ణాడెల్టా అడుగంటిందని..చుక్కనీరు లేక రైతులు గుండెలు ఆగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్లు తీసుకురాకపోతే రాజీనామా చేస్తామని టీడీపీ నేతలే అంటున్నారన్నారు.

బోగస్ లెక్కలతో మోసం..!
ప్రత్తిపాటి పుల్లారావు 325 కరువు మండలాలు అంటాడు. చంద్రబాబు ఏమో 196 కరువు మండలాలు అని మాట్లాడుతారు. భోగస్ రిపోర్ట్ లతో రైతుల నోట్లో మట్టి కొడితే చరిత్ర క్షమించదని పద్మ చంద్రబాబును హెచ్చరించారు. రైతుల గుండెల మీద ఆర్భాటంగా శంకుస్థాపన చేస్తున్న చంద్రబాబు ..రాష్ట్రంలో ఉన్న దుర్బిక్ష పరిస్థితులను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. చంద్రబాబు రాష్ట్రానికి పెద్ద సమస్యగా మారారని...రైతు అన్న పదమే ఉచ్చరించకపోవడం దౌర్భాగ్యమన్నారు.  రైతుల కళ్లలో రక్తం కారుతుంటే బోగస్ లెక్కలు చూపుతూ కాగితాల మీద పాలన సాగిస్తున్నారని విరుచుకుపడ్డారు. 

తక్షణమే యాక్షన్ ప్లాన్ ప్రకటించాలి..!
శుభలేఖలు ఇచ్చేందుకు వెళతావు గానీ రైతులకు నీళ్లు ఇచ్చేందుకు మాత్రం వెళ్లి ఎందుకు అడగడం లేదని పద్మ చంద్రబాబును ప్రశ్నించారు. ఎన్నికల్లో రూ. 5 వేల కోట్లతో రైతు స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఉచిత విద్యుత్  అన్నారు. పంట నష్టనివారణకు ఇన్సూరెన్స్ ఇస్తామన్నారు . ఇవన్నీ ఎక్కడ పోయాయని పద్మ చంద్రబాబును నిలదీశారు. ఇదొక దద్దమ్మ , చేతగాని ప్రభుత్వమని పద్మ విమర్శలు గుప్పించారు. తక్షణమే యాక్షన్ ప్లాన్ ప్రకటించి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

తాజా ఫోటోలు

Back to Top