అన్నా..మేమంతా నీ వెంటే

నెల్లూరు: దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలో చేనేతలం గౌరవంగా బతికామని, చంద్రబాబు పాలనలో దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని చేనేతలు ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ మేం గౌరవంగా బతకాలంటే అన్నా..మీరు ముఖ్యమంత్రి కావాలని చేనేతలు ముక్తకంఠంతో నినదించారు. వెంకటగిరి నియోజకవర్గంలోని కలిచేడు గ్రామంలో నిర్వహించిన చేనేతల ఆత్మీయ సమ్మేళనంలో చేనేతలతో 
వైయస్‌ జగన్‌ ముఖాముఖి ఇలా..
 
చేనేతలకు ప్రత్యేక బ్యాంకు ఏర్పాటు చేయాలి: ఈశ్వరయ్య
చేనేత కార్మికులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. పిల్లలను చదివించేందుకు, పెళ్లిలకు బయట అప్పులు చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.  చేనేత కార్మికులకు ప్రత్యేకంగా ఒక బ్యాంకు ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. 

వైయస్‌ జగన్‌: ధర్మవరం వెళ్లినప్పుడే చేనేతలకు 45 ఏళ్లకే పింఛన్లు ఇచ్చే ఆలోచన పుట్టింది. మన అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేతలకు ప్రత్యేక కార్పొరేషన్‌తీసుకొస్తానని మాట ఇస్తున్నాను.
––––––––––––––––––––––

మీరు రావాలన్నా..:  పద్మా, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు
అన్నా ..మీరు చెప్పిన పథకాలన్నీ కూడా చాలా బాగున్నాయి. గతంలో వైయస్‌ రాజశేఖరరెడ్డి ఇచ్చి చూపించారు. మీరు ముఖ్యమంత్రి అయిన తరువాత మీరు కరెంటు ఉచితంగా ఇవ్వాలి. బిడ్డలను చదివించుకోలేకపోతున్నాం. మీరు చెప్పిన హామీలతో మేం సంతోషంగా ఉన్నాం. మీరు వెంకటగిరికి రావడంతోనే ఈ నెల ధన్యమైందన్నా..మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఆహ్వానిస్తున్నాం. మీరే ముఖ్యమంత్రి అవుతారు. 
వైయస్‌ జగన్‌: చంద్రబాబు వెయ్యి రూపాయల సబ్సిడీ ఇస్తామని చెప్పి మాట తప్పారు. ప్రతి చేనేత కుటుంబానికి రూ,2 వేల సబ్సిడీ ఇస్తానని మాట ఇస్తున్నాను. 
––––––––––––––––––––––––

చట్టసభల్లో మాట్లాడేందుకు ఒక్క వ్యక్తి కూడా లేడన్నా.. తలసీ కృష్ణ
రాష్ట్రంలో చేనేతల తరఫున చట్టసభల్లో మాట్లాడేందుకు ఒక్క వ్యక్తి కూడా లేడన్నా..మీ తరఫున మా వర్గం నుంచి అవకాశం కల్పించాలి
వైయస్‌ జగన్‌: కర్నూలు పార్లమెంట్‌ నుంచి బుట్టా రేణుకమ్మకు అవకాశం కల్పించాం. ఈ సారి కూడా అవకాశం కల్పించేందుకు ప్రయత్నం చేస్తాం.
––––––––––––––––
అన్నా..మీరు ముఖ్యమంత్రి కావాలి:  కళ్యాణ్‌
అన్నా..నేను టీడీపీ కార్యకర్తను. నేను బైబిల్‌ చదువుతాను. నిజాయితీగా అన్నా..మీరు రెండు అడుగులు ముందుకు వేస్తానంటున్నావు. నీవు ముఖ్యమంత్రి కావాలన్నా..
–––––––––––––––––––
వైయస్‌ఆర్‌ హయాంలో గౌరవంగా బతికాం: సుబ్రమణ్యం
పింఛన్‌ రూ.5 వేలు ఇస్తే బాగుంటుందన్నా. మీరు మాట ఇస్తే తప్పరని నమ్ముతున్నాం. నాడు వైయస్‌ఆర్‌ హయాంలో ఎంతో గౌరవంగా బతికాం. మళ్లీ అలాంటి రోజులు రావాలని కోరుతున్నాను.
వైయస్‌ జగన్‌: చేనేతలకు కచ్చితంగా రుణాలు ఇవ్వాలి. ఆర్టిసియన్‌ కార్డులకు వాల్యూ రావాలి. కార్డు ఆధారంగా చేనేత కుటుంబానికి వడ్డీ లేకుండా లక్ష అందిస్తే బాగుంటుంది. రేపొద్దున మనందరి ప్రభుత్వం వచ్చిన తరువాత కార్డులు ఇచ్చే ప్రయత్నం చేస్తాం.
–––––––––––––––––
అన్నా..పొదుపు రుణాలు మాఫీ చేయాలి: వెంకటరత్నమ్మ
అన్నా..చంద్రబాబు పొదుపు రుణాలు మాఫీ చేస్తామని మాట ఇచ్చి మోసం చేశారు. మీరు వచ్చిన తరువాత రుణాలు మాఫీ చేయాలి.
వైయస్‌ జగన్‌: మనందరి ప్రభుత్వం వచ్చాక నాలుగు విడతల్లో పొదుపు రుణాలు మాఫీ చేసి..ఆ డబ్బులు మీ చేతుల్లోనే పెడతాం. అంతేకాదు..వడ్డి లెక్కలు కూడా మనమే కట్టి
–––––––––––––––––
పథకాలన్నీ జన్మభూమి కమిటీలకే: శ్రీనివాసులు
అన్నా..ప్రభుత్వ పథకాలు అర్హులకు అందడం లేదు. అన్నీ జన్మభూమి కమిటీలకే ఇస్తున్నారు. ఈ పరిస్థితి మార్చాలి

వైయస్‌ జగన్‌: ప్రతి గ్రామంలోనూ గ్రామ సచివాలయం ఏర్పాటు చేసి మీ గ్రామంలోనే పది మందికి ఉద్యోగాలు ఇస్తాం. ఎవరి చుట్టూ మీరు తిరగాల్సిన పని లేకుండా 72 గంటలకే ప£ý కాలు అందేలా చూస్తాం. ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం 
Back to Top