వైయస్‌ జగన్‌ భరోసాతో చేనేతల సంతృప్తి

నెల్లూరు:  వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇస్తున్న భరోసాతో చేనేతలు సంతృప్తిగా ఉన్నారని చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మోహన్‌రావు అన్నారు.  ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ప్రతి జిల్లాలో కూడా చేనేతల సదస్సులు పెట్టి మనకు భరోసా కల్పిస్తున్నారని తెలిపారు. చేనేతల కోసం 45 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని వైయస్‌ జగన్‌ ప్రకటించడం సంతోషకరమన్నారు. ఈ ప్రభుత్వం చేనేతలకు ఎలాంటి మేలు చేయలేదన్నారు. జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని ఆయన పిలుపునిచ్చారు. 
Back to Top