చేనేత రంగాన్ని ఆదుకోవాలి: రావి వెంకటరమణ

పొన్నూరుః తీవ్రమైన సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నాయని వైయస్ ఆర్ సిపి నియోజకవర్గ సమన్వయ కర్త, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ అన్నారు.  జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పట్టణంలోని వీవర్స్‌ కాలనీలో ఉన్న చేనేత నేత ప్రగడ కోటయ్య విగ్రహానికి పూలమాలలు వేసి  ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రావి మాట్లాడుతూ ఒకవైపు మిల్లు వస్త్రాలతో చేనేత రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దరిమిలా వస్త్రాలపై జిఎస్టీ విధించడం ఆ రంగాన్ని మరింత కుంగదీసిందన్నారు. ప్రభుత్వం జిఎస్టీ అంశంలో పునరాలోచించాలని రావి డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ, చేనేత నాయకులు పాల్గొన్నారు.
కష్టాల్లో చేనేత రంగం...
చేనేత రంగంపై ఆధారపడ్డ లక్షలాది కుటుంబాలు నేడు తీవ్ర దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ సజ్జా హేమలత ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులు మిల్లు వస్త్రాలతో పోటీపడి నైపుణ్యాన్ని పెంచుకొని గత ప్రాభవాన్ని తిరిగి సాధించాలని ఆకాంక్షించారు. ఆమెవెంట పలువురు చేనేత నాయకులు ఉన్నారు.
Back to Top