చేనేత పరిశ్రమను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వాలు


–వైయస్సార్‌ సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి 
భట్టిప్రోలు (గుంటూరు):  వ్యవసాయం  అత్యధిక శాతం జనాభా ఆధారపడి ఉన్న చేనేత పరిశ్రమను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని వైయస్సార్‌ సీపీ బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి కౌతరపు పిచ్చయ్యశాస్త్రి విమర్శించారు. సోమవారం భట్టిప్రోలులో  విలేకరుల సమావేశంలో ఆయన  మాట్లాడారు. చిలపల నూలుపై జీఎస్టీ ఎత్తి వేయాలని కేంద్రం దృష్టికి తీసుకు వెళ్ళలేని ముఖ్యమంత్రి చంద్రబాబుకు  జాతీయ చేనేత దినోత్సవాన్ని నిర్వహించే అర్హత లేదన్నారు.  దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరరెడ్డి కార్మికుల స్ధితి గతులను పాదయాత్రలో తెలుసుకొని అధికారంలోకి రాగానే ఆప్కోకు రూ 50 కోట్లు విడుదల చేశారని గుర్తు చేశారు. దీంతో సొసైటీలలోని కార్మికులకు పని కల్పించటం జరిగిందని చెప్పారు. ఈ మూడేళ్ళల్లో చేనేత పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం చేసింది శూన్యమని అన్నారు. వైయస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో చేనేత సమస్యలపై త్వరలో నేతన్న మేలుకో అనే నినాదంతో మండలంలోని ఐలవరం గ్రామం నుంచి భట్టిప్రోలు తహసీల్ధార్‌ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ మండల కన్వీనర్‌ పడమటి శ్రీనివాసరావు, ఐలవరం గ్రామ పార్టీ కన్వీనర్‌ మాచర్ల తులసీ రంగయ్య, పార్టీ మండల యువజన విభాగం అధ్యక్షులు బట్టు రాజారావు, పార్టీ నాయకులు గొట్టుముక్కల సత్యన్నారాయణ, పి. పాండురంగారావు, ఆర్‌. కోటి వీరయ్య, కొన్నిపాటి మురళి తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top