చేనేతలు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

అనంతపురం: అధికార టీడీపీకి చెందిన పలువురు చేనేత కుటుంబాలు ఆ పార్టీకి రాజీనామా చేసి వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. అనంతపురం జిల్లా ధర్మవరంకు చెందిన చేనేతలు వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఆయన సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నేతన్నలను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైయస్‌ఆర్‌సీపీ ధర్మవరం సమన్వయకర్త కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎగిరేది వైయస్‌ఆర్‌సీపీ జెండానే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

 
Back to Top