చేనేత కుటుంబాలు వైయస్‌ఆర్‌సీపీలో చేరిక

 

అనంతపురం: ధర్మవరం నియోజకవర్గంలోని పలు చేనేత కుటుంబాలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాయి. వైయస్‌ఆర్‌సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సమక్షంలో వినోద్‌ ఆధ్వర్యంలో భారీగా చేనేత కార్మికులు, యువకులు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. వారికి కేతిరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ..ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంలో చేనేతలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. గతంలో ఉన్న సంక్షేమ పథకాలను అమలు చేయకుండా నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. పెరిగిన ముడిపట్టు ధరలతో చేనేత రంగం పీకల్లోతు సంక్షోభంలోకి కూరుకుపోయిందన్నారు. గత వైభవం మళ్లీ రావాలన్నా..చేనేత ముడిపట్టు రాయితీ పథకం సక్రమంగా అమలు కావాలన్నా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్నారు. పార్టీలో చేరిన వారిలో బాబావలి, లోకేష్, మంజు, శివయ్య, కేశవ, పీరా, షేక్‌షావలి, నాగార్జున, ధన, నూరు, మధు, బాలు, గోపాల్, అశోక్‌ తదితరులు ఉన్నారు.
 
Back to Top