బాబుపై చీటింగ్‌ కేసు నమోదు చేయాలి

వైయస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి రవితేజ
నెల్లూరు: యువతను మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చీటింగ్‌ కేసు నమోదు చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విద్యార్థి విభాగం నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రవితేజ డిమాండ్‌ చేశారు. శనివారం జిల్లాలోని ఆత్మకూరు పోలీస్‌ స్టేషన్‌లో విద్యార్థి విభాగం నేతలు చ్రంబాబుపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికల  ముందు   చంద్రబాబు  ఇంటికొ ఉద్యోగం ఇస్తామని, నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చారన్నారు. పార్టీ మ్యాని ఫెస్టోలో నిపుణుల పర్యవేక్షణలో తయారు  చేయడం జరిగిందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు. ఈ మాయ మాటలను నమ్మిన యువత ఓట్లు వేసి చంద్రబాబును  గెలిపించారని తెలిపారు. కాని బాబు అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు.  ఉద్యోగ అవకాశాలు కల్పించలేని స్థితిలో కనీసం నిరుద్యోగ భృతి అయిన అందచేయాలని డిమాండ్‌ చేశారు. యువతకు ఇచ్చిన  హామీలను నెరవేర్చక పోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని  హెచ్చరించారు. కార్యక్రమంలో  వైయస్‌ఆర్‌సీపీ మండల నాయకుడు పొక్కుల ఈశ్వరరెడ్డి, పెదయ్య,  విద్యార్థి  విభాగం మండల ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి ,  నాయకుడు పొతిరెడ్డి , యువ నాయకులు గుజ్జుల సంజయ్,బుటారు సాయి, మధు తదితరులు పాల్గొన్నారు.


 

తాజా ఫోటోలు

Back to Top