చరిత్రపుటల్లోకి షర్మిల పాదయాత్ర

మహబూబ్‌నగర్:

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక మహిళా నేతగా ఇదివరకు 250 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి రికార్డు సృష్టించారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ ఎమ్.వి. మైసూరారెడ్డి చెప్పారు. ఇప్పుడు ‘మరో ప్రజాప్రస్థానం’ ద్వారా షర్మిల 500 కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేసి ఇప్పటివరకు ఉన్న రికార్డును బద్ధలుగొట్టారని తెలిపారు. పాదయాత్రలో మైసురారెడ్డి సోమవారం పాల్గొని షర్మిలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చేపట్టిన పథకాలు ప్రజలను బాగా ఆకర్షించాయనీ, ఆయన కుమార్తె షర్మిల చేపట్టిన యాత్రకు గ్రామగ్రామనా అఖండస్వాగతం లభిస్తోందనీ పేర్కొన్నారు.

Back to Top