'చరిత్ర హీనుడిగా మిగిలిన చంద్రబాబు'

కాకినాడ, 17 మార్చి 2013: శాసనసభలో గురువారంనాడు ఓటింగ్‌ జరిగిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలకని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చరిత్ర హీనుడిగా మిగిలిపోయారని కాకినాడ అర్బన్‌ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి విమర్శించారు. ఈ ప్రభుత్వానికి చేతనైతే, దమ్మూ, ధైర్యం ఉంటే విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోవాలని‌ ఆయన సవాల్ చేశారు. మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డిని అభిమానించే ఎమ్మెల్యేలే విప్‌ను ధిక్కరించి అవిశ్వాసానికి మద్దతు పలికారని చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలకు వెళ్తే తాము చేసింది ఒప్పో, కాదో ప్రజలు తేలుస్తారని ఆయన అన్నారు.
Back to Top