వైయస్సార్‌సీపీలోకి చంద్రశేఖర్‌రెడ్డి

వాల్మీకిపురం మండలం, చింతపర్తికి చెందిన సీనియర్‌ నాయకుడు, బిజిఆర్‌ ప్యామిలీ రెస్టారెంట్‌ అధినేత గుడ్రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం వైయస్సార్‌సీపీలో చేరారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి సమక్షంలో తన అనుచురులతో కలసి వైయస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. సుదీర్ఘ కాలంగా రాజకీయాలల్లో వున్న చంద్రశేఖర్‌రెడ్డి వైయస్సార్‌సీపీ రావడం సంతోషంగా వుందని ఎమ్మెల్యే అన్నారు. గుడ్రెడ్డి చేరికతో మండలంలో వైయస్సార్‌సీపీకి బలం చేకూరిందన్నారు. ఈ సందర్భంగా గుడ్రెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాబోవు ఎన్నికల్లో వైయస్సార్‌సీపీ గెలుపుకు తన శాయశక్తుల కృషిచేస్తానని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో వెంకట్రమణారెడ్డి, రమేష్, అమరనాథరెడ్డి, రామకృష్ణారెడ్డి, శ్రీరాములు,నరసింహులుతో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. 

Back to Top