ప్ర‌త్యేక‌హోదాపై బాబూ రెండు నాలుక‌ల‌ ధోర‌ణి

విజయనగరం: ప్రత్యేక హోదాపై చంద్రబాబు పూటకో మాట మాట్లాడుతున్నారని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభ్రదస్వామి ఆరోపించారు. ఆదివారం విజయనగరంలో కోలగట్ల వీరభ్రదస్వామి మాట్లాడారు. చంద్ర‌బాబు ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసి ప్రత్యేక హోదా వల్ల ఉపయోగం లేద‌ని అంటారు. తిరిగి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వ‌చ్చి ప్రత్యేక హోదా కావాలంటూ రెండు నాలుక‌ల‌ ధోర‌ణిలా మాట్లాడుతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తూ బాబు కాలం వెల్ల‌దీస్తున్నార‌ని మండిప‌డ్డారు. హోదాపై ఇప్ప‌టికైనా ఒక స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని ఆయన డిమాండ్ చేశారు. ప్ర‌త్యేక హోదా విష‌యంలో బీజేపీపై ఎందుకు ఒత్తిడి తేవడం లేదని చంద్రబాబును కోలగట్ల ప్రశ్నించారు. రాష్ట్రంలో కరవు తాండవిస్తుంటే బాబు మాత్రం విదేశీ ప‌ర్య‌ట‌న‌లూ చేయ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మాంజ‌స‌మ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

Back to Top