చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం

  • ప్రజాసమస్యలు,యువత భవిష్యత్తును బాబు గాలికొదిలేశారు
  • అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకుతింటున్నారు
  • నిరుద్యోగభృతి ఇస్తామని చెప్పి ఓట్లు దండుకొని వంచించారు
  • పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో సీఎం దిష్టిబొమ్మ దహనం

పార్వతీపురం: ఎన్నికల హామీలు విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వంపై వైయస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ నేత ప్రసన్నకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలకు రూ.2వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్న చంద్రబాబు మాట తప్పారని ధ్వజమెత్తారు. విజయనగరం జిల్లా పార్వతీపురం  నియోజకవర్గంలో  నిరుద్యోగ భృతి విషయంలో మాటతప్పిన సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో దహనం చేశారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త జే. ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ...నిరుద్యోగ యువతి, యువకులకు రూ. 2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఓట్లు దండుకొని వంచించారని బాబుపై మండిపడ్డారు. 

 రాష్ట్రంలో లక్షలాది మంది యువత ఉద్యోగాలు, ఉపాధి లేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారన్నారు. విదేశాల పేరుతో విలాసాలు చేస్తున్న చంద్రబాబు పరిశ్రమలు, పాట్నర్‌షిప్‌ సమ్మిట్‌లంటూ మరోమారు మోసం చేస్తున్నారని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం విడిపోయి రెండున్నర సంవత్సరాలైనా ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారని దుయ్యబట్టారు. ప్రజా సమస్యలను, యువత భవిష్యత్తును గాలికొదిలేసి టీడీపీ నేతలు రాష్ట్రాన్ని అడ్డంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. 

ప్రత్యేక హోదా వస్తే రాష్ట్ర యువతకు మంచి భవిష్యత్తు ఉంటుందని పోరాడుతుంటే చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం హోదాను కేంద్రానికి తాకట్టుపెట్టారని ఫైరయ్యారు. సంవత్సరానికి లక్షల సంఖ్యలో విద్యాసంస్థల నుంచి పట్టాలు పట్టుకొని వస్తున్న యువత పరిస్థితి ఏంటని బాబును ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజలను వంచించడం మానుకొని ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా దృష్టిసారించాలని హితవుపలికారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ సీపీ యువజన విభాగం నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 
 
Back to Top