ఆనాటి లేఖ మటుమాయం..!

చంద్రబాబు రెండు నాల్కల ధోరణిని బయటపెట్టిన వైఎస్సార్సీపీ..!
హడావుడిగా అధికార వెబ్ సైట్ నుంచి లేఖ తొలగింపు..

హైదరాబాద్ః
టీడీపీ వక్రబుద్ధి మరోసారి బయటపడింది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో బాక్సైట్
తవ్వకాలు జరపొద్దంటూ 2011లో ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు...అప్పటి
కాంగ్రెస్ ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖను టీడీపీ అధికార వెబ్ సైట్ నుంచి
తొలగించింది. తవ్వకాలకు తాము వ్యతిరేకమంటూ చంద్రబాబు ఆనాడు రాసిన లేఖను
వైఎస్ఆర్సీపీ మీడియా ముందుంచగా...అప్రమత్తమయిన పచ్చప్రభుత్వం హడావుడిగా
వెబ్ సైట్ నుంచి లేఖను మాయం చేసింది. దీంతో, చంద్రబాబు రెండు కళ్ల
సిద్ధాంతం మరోసారి వెలుగులోకి వచ్చింది. 

బాక్సైట్
తవ్వకాలకు అనుమతి ఇస్తూ  టీడీపీ సర్కార్ గురువారం జీవో నంబర్ 97 జారీ
చేసింది. మొత్తం 8902 ఎకరాల్లోని 565 మిలియన్ టన్నుల బాక్సైట్ నిల్వలపై
కన్నేసిన ప్రభుత్వం... మొదటి దశలో 3030 ఎకరాల్లో తవ్వకాలను
అనుమతిచ్చేసింది. తద్వారా 223 మిలియన్ టన్నుల బాక్సైట్‌ను వెలికి తీసి
సొమ్ము చేసుకోవాలని పన్నాగం పన్నింది.  ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ
ఇప్పటికే గిరిజన సంఘాలు, వైఎస్సార్సీపీతో పాటు పలు పార్టీలు నిప్పులు
చెరుగుతున్నాయి. ప్రాణాలు పణంగా పెట్టయినా సరే బాక్సైట్ తవ్వకాలను
అడ్డుకుంటామని తేల్చి చెబుతున్నాయి.
Back to Top