ధనదాహం...వంచన

  • రాజధాని నిర్మాణం పేరుతో కాలయాపన
  • శంకుస్థాపనలే తప్ప ప్రారంభోత్సవాలు లేవు
  • అన్నీ టెంపరరే..మాయమాటలతో పబ్బం గడుపుతున్న బాబు
  • విశాఖను దోచుకుతింటున్నారు
  • మేం వచ్చాక తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదు
  • టీడీపీ ఆటలు సాగవుః బొత్స సత్యనారాయణ
విశాఖపట్నం) రాజధాని నిర్మాణం పేరుతో కాలయాపన చేస్తూ చంద్రబాబు ప్రజలను వంచిస్తున్నాడని వైయస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. మంత్రుల బ్లాకులు, రోడ్లు, పర్యాటక స్థలాలంటూ శంకుస్థాపనలు చేస్తున్నారే తప్ప ప్రారంభోత్సవాలు లేవని ఎద్దేవా చేశారు. అన్నీ టెంపరరే అంటున్నారని మండిపడ్డారు.    ప్రపంచంలో మేటి రాజధాని అంటూ ప్రజలకు లేనిపోని ఆశలు కల్పిస్తూ మాటలతో కాలం గడుపుతున్నారే తప్ప.... అధికారంలోకి వచ్చి 39  నెలలవుతున్నా ఇంతవరకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. 20 శాతం ఆస్తులుంచుకొని మిగతావి పంచేయాలంటూ చంద్రబాబు మాట్లాడడంపై బొత్స తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.  వైయస్ జగన్ పై అవాకులు చెవాకులు పేలడం మానుకోవాలని ముఖ్యమంత్రిని హెచ్చరించారు. చంద్రబాబుకు దమ్ముంటే ఆయన ఆస్తులతో ముందుకు రావాలని...ప్రజాకోర్టులో తేల్చుకుందామని సవాల్ విసిరారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. 

 చంద్రబాబు తన ధనదాహం, ప్రచార ఆర్భాటం కోసం  ప్రజలను మోసం చేస్తున్నాడని బొత్స మండిపడ్డారు. రాజధాని డిజైన్లకు ఇంజినీర్లను కాదని సినిమావాళ్లను సంప్రదించడమేంటని ప్రశ్నించారు. రాష్ట్రం ఎటు వెళ్తోందని, ఏమిటీ మేధావి తనమని బాబుపై నిప్పులు చెరిగారు. తమకీ రంగంలో ప్రాదాన్యత లేదని సినిమా డైరెక్టర్లు చెబుతుంటే బాబు వాళ్ల సలహాల కోసం వెంపర్లాడడంలో ఉద్దేశ్యమేంటని ప్రశ్నించారు. ప్రజల అవకాశాలను క్యాష్ చేసుకోవడానికే బాబు ఇలాంటి చీఫ్ ట్రిక్స్ ప్లే చేస్తున్నాడని,  ముఖ్యమంత్రికి ఇది తగదని బొత్స హితవు పలికారు.  ముఖ్యమంత్రి తీరును చూసి మేధావులు, నిపుణులు, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. చంద్రబాబుకు ఎంత సేపు తన స్వార్థ ప్రయోజనాలే తప్ప.... దేశంలో మేటి రాజధానిగా ఏపీని చేయాలన్న చిత్తశుద్ధి లేదన్నారు.  ఏనాడైతే సింగపూర్ కంపెనీకి సమగ్ర నివేదిక తయారుచేయడానికి ఇచ్చారో ఆరోజే బాబు డొల్లతనం బయటపడిందన్నారు. రాష్ట్రంలో దురదృష్టకర పరిణామాలు ఉన్నాయన్నారు. చులకన మాటలు మాట్లాడవద్దని ముఖ్యమంత్రికి సూచించారు. 

దేశంలో ముంబై తర్వాత అంతటి పేరున్న విశాఖ ఇమేజ్ ను చంద్రబాబు, ఆయన తనయుడు, టీడీపీ నేతలు చెడగొట్టారని బొత్స విమర్శించారు. భూ కబ్జాలు చేసి పక్క రాష్ట్రాల వాళ్లు రావాలంటేనే భయపడేలా చేశారన్నారు. విశాఖలో వేల ఎకరాలు ట్యాంపరింగ్ అయ్యాయని అధికారులు చెబితే సిట్ పేరుతో చంద్రబాబు కాలయాపన చేస్తున్నాడని బొత్స మండిపడ్డారు. భూ కబ్జాలో ఉన్న పెద్దల్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. విశాఖను దోచుకుతింటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  అధికారులు ప్రజాప్రతినిధుల మీద..ప్రజాప్రతినిధుల అధికారుల మీద ఫిర్యాలు చేస్తున్నారే తప్ప చర్యలు మాత్రం శూన్యమన్నారు.   ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు పనితీరు మారాలని హితబోధ చేశారు. ఈ మూన్నెళ్లలో మీరు వేసిన సిట్ విచారణ ఏమైంది..? ఎవరి మీద చర్యలు తీసుకున్నారు. ఎన్ని ఎకరాలు ట్యాంపరింగ్ జరగింది అన్నీ స్పష్టంగా చెప్పాలన్నారు. ప్రజల ఆదరణతో వైయస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక తప్పు చేసిన వారిని శిక్షించక తప్పదన్నారు. బాబు ఆటలు సాగవని హెచ్చరించారు.  

Back to Top