బాబుది న‌య‌వంచ‌న దీక్ష‌

తణుకు: సీఎం చంద్ర‌బాబుది నయవంచన దీక్ష అని పశ్చిమ గోదావరి జిల్లా వైయ‌స్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. తణుకు నియోజకవర్గ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న వైయ‌స్‌ఆర్‌ సీపీ నేతలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, ఆళ్ల నాని, ముదునూరి ప్రసాదరాజు, కారుమురు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. చంద్రబాబు మూడేళ్ల పాలనలో చేసిందేమీ లేదని అన్నారు. రెండేళ్ల తర్వాత ఓడిపోతామని తెలిసి టీడీపీని దోపిడీ రాజ్యంగా మార్చారని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ప్లీనరీ సమావేశంలో కొట్టు సత్యనారాయణ, తెల్లం బాలరాజు, పాతపాటి సర్రాజు, మేకా శేషుబాబు, పీ. వాసుబాబు, కే. శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Back to Top